Cricket: అండర్-19 వరల్డ్ కప్: వర్షం కారణంగా ఆటకు విరామం!
- ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించిన షా, కల్రా
- నోబాల్ కు భారీ సిక్సర్ బాదిన మంజోత్ కల్రా
- వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపివేత
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఆదిలోనే వరుణుడు షాక్ ఇచ్చాడు. భారత ఇన్నింగ్స్ ను కెప్టెన్ పృథ్వీ షా (10), మంజోత్ కల్రా (9) ఆరంభించారు. మూడో ఓవర్ మూడో బంతిని సంధించిన ఇవాన్స్ బంతిని వేసే క్రమంలో వికెట్లపైనున్న బెయిల్స్ ను పడగొట్టాడు.
దీంతో అంపైర్ దానిని నోబాల్ గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. అప్పుడు ఇవాన్స్ సంధించిన బంతిని లాంగ్ ఆన్ మీదుగా లెఫ్ట్ హ్యాండర్ మంజోత్ కల్రా బౌండరీ లైన్ దాటడంతో అంపైర్ సిక్సర్ ప్రకటించాడు. అదే సమయంలో వర్షం పడింది. దీంతో ఆ ఓవర్ పూర్తికాగానే ఆటకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. వరుణుడు అడ్డుపడడంతో ఊపుమీదున్న భారత ఆటగాళ్లు, అభిమానులు నిరాశచెందారు.