nithyamenon: ఎన్టీఆర్ బయోపిక్ కోసం నిత్యామీనన్ ను అడిగారా?

  • త్వరలో సెట్స్ పైకి ఎన్టీఆర్ బయోపిక్ 
  • బసవతారకం పాత్రకోసం అన్వేషణ 
  • అక్కినేని పాత్రపై  పెరుగుతోన్న ఆసక్తి

ప్రస్తుతం వెంకటేశ్ సినిమాకి సంబంధించిన పనుల్లో తేజ బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఆయన ఎన్టీఆర్ బయోపిక్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఒక వైపున అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీమతి 'బసవతారకం' పాత్ర కోసం అన్వేషణ కొనసాగుతున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే ఆ పాత్ర కోసం నిత్యామీనన్ ను అడిగినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

ఈ పాత్ర చేయడానికి ముందుగా అంగీకరించిన నిత్యామీనన్, ఆ తరువాత తాను చేయలేనంటూ నిస్సహాయతను వ్యక్తం చేసిందట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాలే అందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. దీంతో బసవతారకం పాత్రకి సంబంధించిన నటి ఎంపిక ఇంకా జరగలేదు. ఈ పాత్రలో నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఎన్టీఆర్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నటువంటి అక్కినేని పాత్రను ఎవరు పోషించనున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది . 

  • Loading...

More Telugu News