Russia: రక్తం రంగులోకి మారిన నీరు... తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు
- ఎరుపురంగులోకి మారిన మోల్ చంక నది నీరు
- రష్యాలోని ట్యుమెన్ నగరవాసుల దాహార్తి తీర్చే మోల్ చంక నది
- నీరు ఎరుపు రంగులోకి ఎందుకు మారిందో తెలియక నిపుణుల ఆందోళన
రష్యాలోని ట్యుమెన్ నగరానికి దగ్గరలో ప్రవహిస్తున్న మోల్ చంక నదిలోని నీరు రక్తం రంగులోకి మారింది. దీంతో ఆ నీటితో దాహార్తి తీర్చుకునే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ నది నీటిని పరిశోధించేందుకు వెళ్లిన నిపుణులు ఆ నీరు ఎందుకు రక్తం రంగులోకి మారిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నీటి శాంపిల్స్ టెస్టులు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. రకరకాల రసాయన పదార్థాలు నీటిలో కలవడం వల్లే నది నీరు ఎరుపురంగులోకి మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.