Itching: ఆ మంచి నీళ్లు తాగి.. ఆ ఊరి ప్రజలంతా దురదబారిన పడ్డ వైనం!
- నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఘటన
- విద్యుత్ ఉత్పత్తి అయిన నీరు రివర్స్ పంపింగ్
- టెయిల్‌పాండ్‌లోకి వచ్చిన నీళ్లు నిల్వ
- ఆ నీళ్లే సరఫరా చేయడంతో అనారోగ్యం
కలుషితమైన నీటిని తాగడంతో నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండా గ్రామస్తులు ఒళ్లంతా దురదతో బాధపడుతున్నారు. దానికి తోడు చాలా మందికి వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి అనారోగ్యాలు ఎదురవుతున్నాయి. ఇటీవల నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో విద్యుత్ ఉత్పత్తి అయిన నీటిని రివర్స్ పంపింగ్ చేశారు. అయితే, ఆ నీళ్లు టెయిల్‌పాండ్‌లోకి వచ్చి నిల్వ ఉండడంతో ఈ విషయాన్ని గుర్తించక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు శుద్ధి చేయకుండానే నేరుగా చింతలపాలెం, నాయకునితండాల్లోని వాటర్‌ప్లాంట్‌కు సరఫరా చేస్తున్నారు. అనారోగ్యంతో అక్కడి ప్రజలంతా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ విషయంపై వైద్యాధికారులు స్పందించాలని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.