Gymnastics: అమెరికా మాజీ జిమ్నాస్టిక్స్ వైద్యుడికి మరో 125 ఏళ్ల జైలు!
- వందలమంది మహిళా అథ్లెట్లపై వేధింపులకు దిగిన వైద్యుడు
- మూడు ఆరోపణల్లో శిక్షలు ఖరారు
- రెండు వందల ఏళ్లు దాటిన జైలు శిక్ష
200 మందికిపైగా మహిళా అథ్లెట్లను వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ జిమ్నాస్టిక్స్ వైద్యుడు లారీ నాసల్కు కోర్టు సోమవారం మూడు ఆరోపణల్లో శిక్ష ఖరారు చేసింది. మరో 125 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డిసెంబరు తర్వాత నాసర్‌కు శిక్ష పడడం ఇది మూడోసారి. ఇంగ్హామ్ కోర్టు ఇప్పటికే అతడికి 40-175 ఏళ్ల జైలు శిక్ష విధించగా, చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసులో గత డిసెంబరులో ఫెడరల్ కోర్టు 60 ఏళ్ల శిక్ష విధించింది. తాజాగా సోమవారం నాటి విచారణలో ఈటన్ కౌంటీ కోర్టు మరో 125 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, చేసిన తప్పుకు సోమవారం బాధితులకు నాసర్ క్షమాపణలు చెప్పాడు.
2016లో నాసర్ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. రేచల్ డెన్హోలాండర్ అనే మహిళ తొలిసారి నాసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె ఫిర్యాదుపై నాసర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత బాధితులంతా క్యూకట్టడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.