agni-1: స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఖండాంతర క్షిపణి అగ్ని-1.. విజయవంతంగా ప్రయోగించిన భారత్
- సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగల క్షిపణి
- ఒడిశాలోని డా.అబ్దుల్ కలాం ద్వీపం నుంచి పరీక్ష
- 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవు ఉండే క్షిపణి
సుమారు 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగల స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణి అగ్ని-1ను భారత్ ఈ రోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసింది. ప్రయోగం విజయవంతమైందని, దీన్ని ఇప్పటికే భారత సైన్యంలో చేర్చామని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ పరీక్షను ఒడిశాలోని డా.అబ్దుల్ కలాం ద్వీపం నుంచి చేశారు. అణ్వస్త్ర సామర్థ్యం గల ఈ క్షిపణి దాదాపు 12 టన్నుల బరువు, 15మీటర్ల పొడవు ఉంటుందని, సుమారు 1000 కేజీల వరకు పేలోడ్స్ మోసుకుపోగలదని రక్షణ శాఖ తెలిపింది. అగ్ని-1 ఉపరితలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుందని వివరించారు.