sensex: కుప్పకూలి, కాస్త పుంజుకుని... భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు!
- అమెరికా ప్రభావంతో కుప్పకూలిన మార్కెట్లు
- ఒకానొక సమయంలో 1100 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనం
- వరుసగా ఆరో రోజు కొనసాగిన డౌన్ ట్రెండ్
ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రభావంతో బేర్ మంటున్న భారతీయ స్టాక్ మార్కెట్లపై... అమెరికా మార్కెట్ల ప్రతికూల ప్రభావం పడటంతో... ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమయ్యాయి. దీంతో మార్కెట్ల నష్టాల పరంపరం ఆరోరోజు కూడా కొనసాగింది. ఒకానొక సమయంలో 1100 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనమయింది.
2015 ఆగస్టు తర్వాత ఇంట్రాడేలో సెన్సెక్స్ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత క్రమంగా పుంజుకున్న మార్కెట్లు చివరకు నష్టాలను తగ్గించుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 561 పాయింట్లు నష్టపోయి 34,196 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లు కోల్పోయి 10,498కి పడిపోయింది.
బీఎస్ఈలో ఇవాల్టి టాప్ గెయినర్స్:
రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (4.99%), అడ్వాన్స్ డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (3.97%), వీఐపీ ఇండస్ట్రీస్ (3.88%), బాంబే డయింగ్ (3.78%), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (3.72%).
టాప్ లూజర్స్:
వక్రాంజీ లిమిటెడ్ (-9.99%), దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్ (-8.24%), పీసీ జువెల్లర్స్ (-7.48%), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (-7.26%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (-7.11%).