hanuman: 500 ఏళ్ల పురాతన హనుమాన్ ఆలయాన్ని సొంత ఖర్చులతో పునర్నిర్మిస్తోన్న ముస్లిం
- గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మతసామరస్యం చాటుతోన్న ముస్లిం
- మీర్జాపూర్ లోని 'భిడ్ భంజన్ హనుమాన్' ఆలయ పునర్నిర్మాణ పనులు
- తాను చిన్ననాటి నుంచి ఆ ఆలయాన్ని చూస్తూనే పెరిగానన్న మొయిన్ మెమన్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. సుమారు 500 ఏళ్ల పురాతన హనుమాన్ మందిరాన్ని ఓ ముస్లిం సోదరుడు తన సొంత ఖర్చులతో పునర్నిర్మిస్తున్నాడు. అహ్మదాబాద్‌కు చెందిన ఆయన పేరు మొయిన్ మెమన్ (43). బిల్డర్‌గా మంచి అనుభవం ఉన్న ఆయన ప్రస్తుతం మీర్జాపూర్ ఏరియాలోని 'భిడ్ భంజన్ హనుమాన్' ఆలయ పునర్నిర్మాణ పనుల వద్దే గడుపుతూ ఉన్నాడు. దగ్గరుండి ఆలయ పునర్నిర్మాణ పనులను చేయిస్తున్నాడు. ఈ ఆలయం అప్పట్లో ఎంతో గొప్ప వైభవాన్ని చవిచూసిందని, తాను చిన్ననాటి నుంచి ఆ మందిరాన్ని చూస్తూనే పెరిగానని చెప్పాడు. హనుమాన్ మందిరం శిథిలావస్థకు చేరుకోవడంతో చాలా బాధపడిపోయానని చెప్పాడు.