Andhra Pradesh: ప్రతిఒక్కరూ విభజన చట్టం చూసి ప్రశ్నించాలి: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- పదేళ్ల లోపు విభజన హామీలు అమలు చేయాలని చట్టంలో ఉంది
- బడ్జెట్ తో పని లేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించవచ్చు
- యుటిలైజేషన్ సర్టిఫికెట్స్, డీపీఆర్ ను ఏపీ ఇంతవరకూ ఇవ్వలేదు: విష్ణుకుమార్ రాజు
పదేళ్ల లోపు విభజన హామీలు అమలు చేయాలని చట్టంలో ఉందని, ప్రతిఒక్కరూ విభజన చట్టం చూసి ప్రశ్నించాలని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ తో సంబంధం లేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించవచ్చని అన్నారు. బడ్జెట్ లో అమరావతి రాజధానికి నిధులు కేటాయించనప్పటికీ, రూ.1500 కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ను, రాజధాని నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ను ఏపీ ఇంతవరకూ ఇవ్వకపోయినప్పటికీ, సాయం చేస్తూనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఆయన్ని ప్రశ్నించగా, రాజకీయపరంగా విధివిధానాలు, సంప్రదాయాలను ఎత్తిచూపించవచ్చు కానీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఎవరూ హర్షించరని ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు.