Amrapali: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7 వరకు కలెక్టర్ ఆమ్రపాలి లాంగ్ లీవ్!

  • 18న జమ్ముకశ్మీర్ లో కలెక్టర్ ఆమ్రపాలి వివాహం
  • వరంగల్, హైదరాబాదుల్లో రిసెప్షన్
  • హనీమూన్ కోసం 26న టర్కీకి ప్రయాణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి లాంగ్ లీవ్ పై వెళ్లనున్నారు. ఈ నెల 18న జమ్మూకశ్మీర్ లో ఐపీఎస్ అధికారి, డయ్యూడామన్ ఎస్పీ సమీర్ శర్మతో ఆమ్రపాలి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఫిబ్రవరి 15 నుంచి మార్చి 7 వరకు లాంగ్ లీవ్ తీసుకోనున్నారు. ఈనెల 22 నుంచి 25 వరకు వరంగల్, హైదరాబాదుల్లో వివాహ రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు హోటల్ బుకింగ్స్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. అనంతరం 26న భర్త సమీర్ తో కలిసి ఆమె హనీమూన్ కు టర్కీ వెళతారు. 

  • Loading...

More Telugu News