sikhar dhawan: మా విజయ రహస్యం ఇదే: శిఖర్ ధావన్
- సఫారీల బౌలింగ్ విభాగం బలంగా ఉంది
- వికెట్లను త్వరగా కోల్పోకపోవడమే మా విజయ రహస్యం
- 10 ఓవర్లు దాటితే పరుగులు సాధించడం ఈజీ
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి, మంచి ఊపు మీద ఉంది. ఈ రోజు జరిగే మూడో వన్డేలో కూడా గెలిచి 3-0 ఆధిక్యంలోకి వెళ్లాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో, తమ విజయ రహస్యం ఏమిటో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు.
మొదటి రెండు వన్డేల్లో తాము త్వరగా వికెట్లను కోల్పోలేదని... తమ గెలుపు వెనక ఉన్న రహస్యం ఇదేనని చెప్పాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగం ఎంత బలంగా ఉందో అందరికీ తెలుసని... కానీ, తాము వారిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని తెలిపాడు. మొదటి 10 ఓవర్లు దాటితే బంతి మెత్తబడుతుందని, అప్పుడు పరుగులు రాబట్టడం సులువుగా మారుతుందని చెప్పాడు.
మరోవైపు, ఈరోజు జరగనున్న మూడో వన్డేకు దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లు డీవిలియర్స్, డీకాక్, డూప్లెసిస్ లు గాయాల కారణంగా దూరమయ్యారు. అయినా, సఫారీల బౌలింగ్ బలంగా ఉండటంతో, మ్యాచ్ ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.