mohan babu: ఫ్యాంట్ వేసుకుందని ఓ మహిళా టీచర్ కు ఉద్వాసన పలికిన మోహన్ బాబు ‘శ్రీవిద్యానికేతన్’ స్కూల్!

  • న్యాయ పోరాటానికి దిగిన టీచర్
  • మరో టీచర్ ఇవే దుస్తులు వేసుకుంటున్నా అభ్యంతరం లేదు
  • అమర్యాదకర తొలగింపు
  • తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని గౌరవాన్ని కాపాడాలని డిమాండ్

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై ఓ మహిళా టీచర్ న్యాయపోరాటానికి దిగింది. దీనికి కారణం ఫార్మల్ ప్యాంట్, పొడుగు చేతుల షర్ట్ వేసుకుని స్కూల్ కు వచ్చిదంటూ ఆమెను యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసేసింది. ఈ విధమైన వస్త్రధారణ పాఠశాల ప్రమాణాలకు అనుగుణంగా లేదని, ఉద్యోగ ఒప్పంద నియమావళిలోని క్లాజ్ 11, 13కు వ్యతిరేకమని పేర్కొంటూ గత డిసెంబర్ 7న పాఠశాల యాజమాన్యం ఆమెకు తొలగింపు ఉత్తర్వులను ఇచ్చింది. సకాలంలో సిలబస్ కూడా పూర్తి చేయలేదని ఆరోపించింది.

బాధితురాలు రాణిరవడ (43) తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో వాస్తవానికి గతేడాది సెప్టెంబర్ 4నే చేరారు. దీనిపై ఆమె మాట్లాడుతూ... తన తొలగింపును సమర్థించుకునేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నంగా సిలబస్ పూర్తి కాలేదన్న ఆరోపణలను పేర్కొన్నారు. తన తొలగింపు అమర్యాదకరంగా ఉందన్నారు. రాత పూర్వక ఆదేశాలు ఇవ్వక ముందే స్కూల్ చైర్మన్ తనను మగవారి ముందే పాశ్చాత్య దుస్తులు వేసుకోవద్దని ఆదేశించారని, తాను తెలుగు వ్యక్తిని కావడమే కారణంగా ఆమె పేర్కొన్నారు. స్కూల్లో మరో మహిళా టీచర్, వేరే జాతీయత కలిగిన ఆమె, తన లాంటి వస్త్రధారణే చేసినప్పటికీ స్కూల్ యాజమాన్యానికి ఇబ్బంది లేదన్నారు. యాజమాన్యం తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకుని, తనను గౌరవించాలని ఆమె న్యాయపోరాటానికి దిగారు.

  • Loading...

More Telugu News