suman: అందరితో టచ్ లో ఉంటేనే అవకాశాలు వస్తాయనేది నేను నమ్మను: సుమన్
- సినిమా నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చాను
- దాదాపు 500 సినిమాల వరకూ చేశాను
- ఏదో శక్తి నన్ను ఇంతవరకూ నడిపించింది
తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుమన్ తన కెరియర్ ను గురించి ప్రస్తావిస్తూ, మనోభావాలను పంచుకున్నారు. " ఎలాంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం నుంచి నేను సినిమా పరిశ్రమకి వచ్చాను. దాదాపు 8 .. 9 భాషల్లో కలుపుకుని 500 సినిమాల్లో నటించాను. ఇన్ని భాషల్లో నటించిన వారు చాలా తక్కువమందే వున్నారు. వాళ్లలో నేను ఒకడిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను"
"ఏదో ఒక సూపర్ పవర్ నన్ను ఈ స్థాయికి చేర్చిందని నమ్ముతున్నాను. సర్కిల్ మెయింటెయిన్ చేయడం వల్లనే అవకాశాలు ఎక్కువగా వస్తాయని చాలామంది చెబుతుంటారు. మొదట్లో నేను కూడా ఈ విషయాన్ని నమ్మేవాడిని. కానీ .. కాలం కలిసి రానప్పుడు ఏ సర్కిల్ టచ్ లోకి రాదనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కనుక అందరితో టచ్ లో వుంటే అవకాశాలు వస్తాయనే విషయాన్ని నేను ఎంతమాత్రం నమ్మను. కష్టాలు .. సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడటమనే విషయంలో మాత్రం అమితాబ్ ను .. రజనీకాంత్ ను స్ఫూర్తిగా తీసుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.