galla jaydev: ఏపీకి ఇచ్చిన నిధులు 'బాహుబలి' కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయి: లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్ ఫైర్‌

  • ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు మెట్రోకి నిధులు కేటాయించారు
  • విభజన చట్టంలో విశాఖకి రైల్వే జోన్ అంశం ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదు
  • చంద్రబాబు 29 సార్లు ఢిల్లీలో పెద్దలను కలిశారు
  • విభజన చట్టంలోని 19 అంశాలను అమలు చేయాల్సి ఉంది

కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నందుకే బెంగళూరు మెట్రోకి నిధులు కేటాయించారని, ఏపీకి మాత్రం అన్యాయం చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఈ రోజు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ... విభజన చట్టంలో విశాఖకి రైల్వే జోన్ అంశం ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు 29 సార్లు ఢిల్లీలో పెద్దలను కలిశారని, విభజన చట్టంలోని 19 అంశాలను అమలు చేయాల్సి ఉందని చెప్పారు.

హామీలపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదని, ప్రత్యేక ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఎవ్వరూ అన్ని వేళలా మభ్యపెట్టలేరని అన్నారు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన నిధులు తెలుగు సినిమా బాహుబలికి వచ్చిన కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు.   

  • Loading...

More Telugu News