Arun Jaitly: కాస్త ఆగండి.. ఏపీకి సంబంధించి ఏం ఇచ్చామన్నది వివరంగా చెబుతా: లోక్‌స‌భ‌లో అరుణ్ జైట్లీ ప్రసంగం

  • హామీలపై మాట్లాడిన తరువాత ప్రసంగం మొదలు పెట్టాలని కోరిన టీడీపీ ఎంపీలు
  • ఆంధ్రప్రదేశ్ మిత్రులు కాస్త సంయమనంతో ఉండండి- జైట్లీ
  • ఆధార్, జీఎస్టీ గురించి మాట్లాడుతోన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏం ఇచ్చామన్నది వివరంగా చెబుతాన‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. లోక్‌స‌భ‌లో అరుణ్ జైట్లీ ప్ర‌సంగిస్తున్నారు. అంత‌కు ముందు ఏపీకి ఇచ్చిన‌ హామీలపై మాట్లాడిన తరువాత ప్రసంగం మొదలుపెట్టాలని టీడీపీ ఎంపీలు కోరారు. అయితే, టీడీపీ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై తర్వాత సమాధానం ఇస్తానని చెప్పిన అరుణ్ జైట్లీ... ఆంధ్రప్రదేశ్ మిత్రులు కాస్త సంయమనంతో ఉండాల‌ని అన్నారు.

కాగా అరుణ్ జైట్లీ ఆధార్ కార్డు గురించి మాట్లాడుతూ... ఆధార్ పై చ‌ట్టం చేస్తూనే వ్య‌క్తిగ‌త గోప్య‌త‌పై స్ప‌ష్ట‌మైన వివ‌ర‌ణ ఇచ్చామ‌ని తెలిపారు. ఆధార్ వినియోగం ఎలా ఉండాలో కూడా చ‌ట్టంలో వివ‌రంగా చెప్పామ‌ని అన్నారు. కాగా, జీఎస్టీ గురించి మాట్లాడుతూ... ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జీఎస్టీ ప‌క్కా అమ‌లుకు చాలా ఏళ్లు ప‌ట్టింద‌ని అన్నారు. తాము దేశంలో ఆరు నెల‌ల్లో జీఎస్టీని పూర్తి స్థాయిలో అమ‌ల్లోకి తెచ్చామ‌ని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల స‌హ‌కారంతోనే ఇది సాధ్య‌మైంద‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News