Andhra Pradesh: లోక్‌సభలో అరుణ్ జైట్లీ ప్ర‌సంగిస్తుండ‌గా.. ప్లకార్డులతో నిరసన ప్రారంభించిన టీడీపీ, వైసీపీ ఎంపీలు

  • కేంద్ర బ‌డ్జెట్ పై జైట్లీ స‌మాధానం ఇస్తుండ‌గా ప్ల‌కార్డులు చూపుతూ నిరసన
  • మరోవైపు మరో అంశంపై కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
  • నిర‌స‌న విర‌మించాల‌న్న స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌స‌భ‌లో ప్ర‌సంగం మొద‌లు పెట్టిన స‌మ‌యంలో నిశ‌బ్దంగానే ఉన్న టీడీపీ, వైసీపీ ఎంపీలు.. జైట్లీ కొన్ని ఆధార్‌, జీఎస్టీ అంశాల‌పై మాట్లాడి మ‌రో విష‌యంపై మాట్లాడుతుండ‌గా అడ్డు త‌గిలారు. కేంద్ర బ‌డ్జెట్ పై జైట్లీ స‌మాధానం ఇస్తుండ‌గా ప్ల‌కార్డులు చూపుతూ, నిర‌స‌న తెలుపుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంశంపై తాను త‌రువాత మాట్లాడ‌తాన‌ని అరుణ్ జైట్లీ చెబుతున్నప్ప‌టికీ టీడీపీ, వైసీపీ ఎంపీలు త‌మ నిర‌స‌న కొన‌సాగిస్తున్నారు. నిర‌స‌న విర‌మించాల‌ని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కోరుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాఫెల్స్ కొన్న అంశంపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News