sirivennela: భానుప్రియ పాత్ర స్వభావాన్ని చెప్పే పాటను అలా మొదలెట్టాను: సిరివెన్నెల
- 'స్వర్ణ కమలం' ఓ కళాఖండం
- భానుప్రియ పాత్ర స్వభావం అలాంటిది
- ఆ పాటలో ఆ స్వభావం చెప్పేశాను
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'స్వర్ణకమలం' గురించి 'విశ్వనాథామృతం' కార్యక్రమంలో గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడారు. 'స్వర్ణకమలం' ఓ కళాఖండం .. అంటూ ఈ సినిమాలో భానుప్రియ పాత్రను గురించి ఆయన ప్రస్తావించారు.
"చిన్నకూతురును నాట్య కళాకారిణిగా చేయాలని తండ్రి ఎంతగానో అనుకుంటాడు. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరికి కావాలనే చిన్నచూపు .. నిరసన భావం భానుప్రియ పాత్రకి ఉంటాయి. ఆమె ఈ సాధారణమైన జీవితాన్ని కాకుండా .. ఆనందకరమైన జీవితాన్ని .. స్వేచ్ఛ ను కోరుకుంటోంది. అందువలన 'ఆకాశంలో ఆశల హరివిల్లు .. ఆనందాలే పూసిన పొదరిల్లు .. అందమైన ఆ లోకం అందుకోనా .. ఆదమరిచి ఈ కలకాలం ఉండిపోనా' అంటూ రాయడం జరిగింది.
నేను ఆకాశంలో తిరుగుతాను ... నేలపై ఉండను. ఈ లోకం నాకొద్దు .. అందమైన ఆ లోకంలో స్వేచ్ఛగా తిరుగుతాను' అంటూ ఆ పాత్ర స్వభావాన్ని చెప్పాను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.