Narendra Modi: ఒమన్‌లోని చారిత్రక శివాలయాన్ని సందర్శించనున్న మోదీ.. అబుదాబిలో ఆలయ నిర్మాణం!

  • పాలస్తీనాలో పర్యటించనున్న తొలి ప్రధానిగా మోదీ రికార్డు
  • ఒమన్‌లో చారిత్రక శివాలయం, పురాతన మసీదు సందర్శన
  • పాలస్తీనాతో పలు ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్రమోదీ చరిత్ర సృష్టించారు. మూడు అరబ్ దేశాల పర్యటనలో భాగంగా జోర్డాన్ చేరుకున్న మోదీ అక్కడి నుంచి పాలస్తీనా వెళ్లారు. తద్వారా పాలస్తీనాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్రకెక్కారు.

అబుదాబిలో 13.6 ఎకరాల్లో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఢిల్లీలోని అక్షర్‌ధామ్ తరహాలో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే తమ ఎదురుచూపులు ఫలించినట్టేనని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని 2020 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

మోదీ తన పర్యటనలో భాగంగా ఒమన్‌లోని చారిత్రక శివాలయాన్ని సందర్శించనున్నారు. ముత్రాహ్‌లోని ఈ శివాలయాన్ని గుజరాతీ వ్యాపారులు నిర్మించారు. 2015లో మోదీ దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి స్థానికుల నుంచి ఆహ్వానం రాగా, ఇప్పుడు సందర్శనకు వెళుతున్నారు.

ఆలయంతోపాటు ఒమన్‌లోని అతి పురాతన మసీదును కూడా భారత ప్రధాని సందర్శించనున్నారు. కాగా, పాలస్తీనాతో మోదీ పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా ఆ దేశంలో మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేయాలని మోదీ భావిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సహకారం అందించనున్నారు.

  • Loading...

More Telugu News