Andhra Pradesh: 14వ ఆర్థిక సంఘం కింద ఏపీకి నిధుల మంజూరు!
- 14వ ఆర్థిక సంఘం కింద రూ. 369 కోట్లు
- ఉపాధి హామీ పథకం కింద రూ. 31.76 కోట్లు
- బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్రం ప్రకటన
ఆందోళనలు, నిరసనలు, సస్పెన్షన్ల మధ్య పార్లమెంట్ సమావేశాలు నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సందర్భంగా ప్రధాని మోదీ నుంచి కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కానీ తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక ప్రకటన వెలువడలేదు. ముఖ్యంగా బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు బడ్జెట్ సమావేశాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అయితే, సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి శుభవార్తను వినిపించింది.
14వ ఆర్థిక సంఘం కింద ఏపీకి రూ. 369 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరో రూ. 31.76 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ నిధుల కేటాయింపులపై ఏపీ మంత్రులు కాని, అధికారులు కానీ ఇంత వరకు స్పందించలేదు.