Manohar Parrikar: ఈ అమ్మాయిల తీరు చూస్తుంటే.. నాకు చాలా భయమేస్తోంది: మనోహర్ పారికర్

  • ఆల్కహాల్ తీసుకునే అమ్మాయిలు ఎక్కువవుతున్నారు
  • గోవా నుంచి డ్రగ్స్ ను తరిమికొడతాం
  • గోవా యువత కష్టపడి పని చేయాలనుకోవడం లేదు

అమ్మాయిల్లో ఆల్కహాల్ సేవించే అలవాటు ఎక్కువవుతోందని... ఇది తనకు ఎంతో భయాన్ని కలగజేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాలో మాదకద్రవ్యాల వ్యాపారంపై ఆయన మాట్లాడుతూ, డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను తరిమికొడతామనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

 కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని భావించడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. మన చట్టం ప్రకారం కొంత మొత్తం డ్రగ్స్ తో పట్టుబడిన వ్యక్తులు ఎనిమిది నుంచి 15 రోజుల్లో బెయిల్ పై బయటకు వస్తున్నారని... వీరిని కోర్టులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయని... ఏదేమైనా డ్రగ్స్ వాడుతున్నవారు పట్టుబడుతుండటం జరుగుతోందని అన్నారు. గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ క్లర్క్ ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారని... గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News