visakhapatnam: విశాఖ రైల్వేజోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..మార్చి 5 లోపు స్పష్టమైన ప్రకటన?

  • గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ రైల్వే సెక్షన్ తో కలిపి రైల్వేజోన్?
  • వాల్తేరు డివిజన్ లోని 80 శాతం ఒడిశాకు వదిలిపెట్టాలని నిర్ణయం?
  • రైల్వే జోన్ పై మార్చి 5 లోపు స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలు

విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో ఈ మేరకు ఒక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది. పరిధిని తగ్గించి జోన్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ రైల్వే సెక్షన్ తో కలిపి రైల్వేజోన్ ఏర్పాటు పై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

 వాల్తేరు డివిజన్ లోని 80 శాతం ఒడిశాకు వదిలి పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా, విశాఖ రైల్వే జోన్ కు సహకహరించాలంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి సుజనా చౌదరి చర్చలు జరిపారు. రైల్వే జోన్ పై మార్చి 5 లోపు స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News