India: మన దేశంలోని యువతకు ఇలా ఉద్యోగావకాశాలు కల్పించొచ్చు: రాష్ట్రపతి కోవింద్

  • ఎన్ఐఎఫ్ టీఈఎం స్నాతకోత్సవంలో పాల్గొన్న కోవింద్
  • మన ఉత్పత్తుల ద్వారా ప్రపంచానికే ఆహారాన్ని అందించవచ్చు
  • తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : రామ్ నాథ్

భారత వ్యవసాయ రంగ ఉత్పత్తులను సూపర్ మార్కెట్లకు అధిక సంఖ్యలో సరఫరా చేయడం ద్వారా ప్రపంచానికే ఆహారాన్ని అందించవచ్చని, తద్వారా మన దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. హర్యానాలోని సోనాపట్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్ మెంట్ (ఎన్ఐఎఫ్ టీఈఎం) మొదటి స్నాతకోత్సవానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ, ప్రపంచంలో అధిక శాతం పాలు ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఉందని అన్నారు. అదే విధంగా, వరి, కూరగాయలు, చెరకు, టీ, పండ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలోను, కోడిగుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఆరో స్థానంలోను మన దేశం ఉందని అన్నారు. భారత ఆహార, పచారీ సరుకుల ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రపంచంలో ఆరో స్థానం మనదని, 2025 నాటికి ఒక ట్రిలియన్ యూఎస్ డాలర్లకు ఈ వ్యాపారం చేరనుందని, దేశానికి సంబంధించిన ఎగుమతుల్లో పదకొండు శాతం ఆహార ఉత్పత్తులే ఉన్నాయని అన్నారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో 42 మెగా ఫుడ్ పార్క్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని అన్నారు.

  

  • Loading...

More Telugu News