YSRCP: గౌతమ్ రెడ్డి మా పార్టీ సభ్యుడు కాదు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి
- గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశాం
- వైసీపీ నాయకుడిగా పేర్కొంటూ టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నాడు
- అతనిని మా పార్టీ సభ్యుడిగా మీడియా పరిగణించొద్దు
విజయవాడకు చెందిన గౌతమ్ రెడ్డి తమ పార్టీ సభ్యుడు కాదని, ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. గౌతమ్ రెడ్డి తనను తాను వైసీపీ నాయకుడిగా పేర్కొంటున్నారని, కొన్ని రోజులుగా టీవీ చర్చా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్న విషయం పార్టీ దృష్టికి వచ్చిందని అన్నారు.
గౌతమ్ రెడ్డిని తమ పార్టీ నుంచి గతంలోనే సస్పెండ్ చేశామని, ఈ విషయాన్ని మరోమారు గుర్తుచేస్తున్నామని పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డిని తమ పార్టీ సభ్యుడిగా పరిగణించొద్దని ఈ మేరకు మీడియా సంస్థలకు తెలియజేస్తున్నట్టు ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.