aadhar card: వీటికి ఆధార్ అనుసంధానం అవసరం లేదు: యూఐడీఏఐ
- ఆధార్ లేదనే కారణంతో ప్రజలకు ఏ లబ్దినీ తిరస్కరించడానికి వీల్లేదు
- వైద్యం, పాఠశాలల్లో ప్రవేశం, రేషన్ పంపిణీలకు ఆధార్ అవసరం లేదు
- ప్రభుత్వ శాఖలకు యూఏడీఏఐ లేఖలు
ప్రతి దానికీ ఆధార్ ను అనుసంధానం చేయడం తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ప్రతి అంశానికీ ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలంటూ ఒత్తిడి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ అనుసంధానాలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పందించింది.
ఆధార్ ను అనుసంధానం చేయలేదనే కారణంతో ప్రజలకు అందించే ఏ లబ్దినీ తిరస్కరించడానికి వీల్లేదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం, పాఠశాలల్లో ప్రవేశం, రేషన్ పంపిణీలకు సంబంధించి ఆధార్ కార్డు లేకపోయినా తిరస్కరించవద్దని ఆదేశించింది. లబ్దిదారుల గుర్తింపుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలు, పరిపాలనా విభాగాలకు లేఖలు రాసింది.