swachcha sarvekshan: మనం బాగుండాలంటే హైదరాబాద్ బాగుండాలి: కేటీఆర్
- స్వచ్ఛత విషయంలో నగరాన్ని అగ్ర స్థానంలో నిలపాలి
- 45 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశాం
- నగరాన్ని 400 యూనిట్లుగా విభజించాం
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టక ముందే హైదరాబాదులో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం నగరాన్ని 400 యూనిట్లుగా విభజించామని చెప్పారు. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు 45 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశామని తెలిపారు. మనమంతా బాగుండాలంటే హైదరాబాద్ బాగుండాలని... హైదరాబాద్ బాగుండాలంటే మనం బాగుండాలని చెప్పారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ లో నగరాన్ని అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2017లో భారత్ వ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ కు అగ్రస్థానం దక్కిందని చెప్పారు. స్వచ్ఛత కోసం విద్యార్థుల చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు.