jeeva: అలా వర్మ దృష్టిలోపడ్డాను .. వరుస సినిమాలు చేశాను: సీనియర్ నటుడు జీవా
- శ్రీహరి వల్లనే హైదరాబాద్ వచ్చాను
- 'గులాబీ' సమయంలో కృష్ణవంశీ పిలిపించారు
- వర్మకి నా నటన బాగా నచ్చింది
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తోన్న జీవా, తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "చెన్నైలో వున్నప్పుడు శ్రీహరి .. నేను ఒకే రూములో ఉండేవాళ్లం. ఆ తరువాత హైదరాబాద్ వచ్చేసిన శ్రీహరి .. నన్ను ఇక్కడికి రప్పించాడు. ఆ తరువాత కొంత గ్యాప్ రావడంతో నేను గుంటూరు వెళ్లిపోయాను"
"ఆ సమయంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా 'గులాబీ' సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వెతుకుతుండగా, కృష్ణవంశీకి నేను గుర్తుకువచ్చానట. దాంతో వర్మకి ఒక మాట చెప్పేసి, గుంటూరు నుంచి నన్ను పిలిపించారు. అలా 'గులాబీ'లో ఛాన్స్ దక్కింది. ఆ సినిమాలో నా నటన నచ్చడంతో, ఆ తరువాత తాను చేస్తోన్న సినిమాల్లోను వర్మ అవకాశాలు ఇచ్చారు. 'సర్కార్'లో నటించడం .. అమితాబ్ నన్ను మెచ్చుకోవడం నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ జీవా చెప్పుకొచ్చారు.