subrahmania swamy: సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం
- గత నెల షోపియాన్లో ఆందోళనకారులపై భారత సైన్యం కాల్పులు
- ఆర్మీ ఆఫీసర్ పై రాష్ట్ర ప్రభుత్వం కేసు
- ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర స్టే
గత నెల జమ్ము కశ్మీర్ లోని షోపియాన్లో భారత సైన్యం ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మేజర్ ఆదిత్యాకుమార్పై కశ్మీర్ రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేబట్టడాన్ని సవాలు చేస్తూ, ఆదిత్యాకుమార్ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, దీనిపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఒక ఆర్మీ ఆఫీసర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందని సుప్రీం ప్రశ్నించింది. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేత వెంటనే రాజీనామా చేయించాలని స్వామి డిమాండ్ చేశారు.
జమ్ము కశ్మీర్ లోని షోపియాన్లో భారత సైన్యం కాల్పులు జరిపిన సమయంలో తన కుమారుడు అక్కడ లేడని ఆదిత్య తండ్రి కోర్టుకు తెలిపారు. అతడిపై నమోదైన కేసును కొట్టివేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రెండు వారాల్లో తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.