Asaduddin Owaisi: దేశం పట్ల మాకున్న ప్రేమను ప్రశ్నించే వారందరికీ ఈ ఉదంతం కనువిప్పు: అసదుద్దీన్ ఒవైసీ
- సంజువాన్ ఉగ్రదాడిలో ఏడుగురు సైనికులు మృతి
- ఆ ఏడుగురు సైనికుల్లో ఐదుగురు ముస్లింలు
- దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నప్పటికీ పాకిస్థానీయులు అంటున్నారు
- దేశం పట్ల విధేయతను రుజువు చేసుకోవాలంటున్నారు
సంజువాన్ ఉగ్రదాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఆ ఏడుగురు సైనికుల్లో ఐదుగురు ముస్లింలు ఉన్నారని, దేశం పట్ల తమకున్న చిత్తశుద్ధి, ప్రేమను ప్రశ్నించే వారందరికీ ఈ ఉదంతం కనువిప్పు కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నప్పటికీ వారిని పాకిస్థానీయులు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని అసదుద్దీన్ మండిపడ్డారు. దేశం పట్ల విధేయతను రుజువు చేసుకోవాలని కొందరు ఇప్పటికీ ముస్లింలను అడుగుతున్నారని, ఇంతకు మించిన విధేయత ఇంకేం కావాలని ఆయన అన్నారు. కాగా, ఉగ్ర దాడులను అరికట్టడంతో కశ్మీర్లోని బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.