sensex: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- లాభాల్లో మొదలైన మార్కెట్లు
- అనంతరం నష్టాల్లోకి
- ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటంతో ఈ ఉదయం మన స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే, ఆ తర్వాత కాసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం ట్రేడింగ్ అస్థిరంగా కొనసాగి, మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్ 40 పాయింట్ల లాభంతో 34,342కి పెరిగింది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 10,552కు చేరుకుంది.
నాగార్జున కన్స్ స్ట్రక్షన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, గ్లాక్సో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, బాంబే డయింగ్, రెలిగేర్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు నష్టాల బాటలో ఉన్నాయి.