Karnataka: రోడ్డుపై రెండు గొర్రెలకు పెళ్లి.. ప్రేమికుల రోజును ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని డిమాండ్!
- ప్రేమికుల రోజును నిరసిస్తూ ఓ పక్క హిందూ సంఘాల నిరసనలు
- మరోవైపు బెంగళూరులో ప్రేమికుల రోజుకు కర్ణాటక రక్షణ వేదిక మద్దతు
- ప్రేమ వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇవ్వాలని వ్యాఖ్య
ప్రేమికుల రోజును నిరసిస్తూ చెన్నైలో ఓ వర్గానికి చెందిన వారు కుక్క, గాడిదకు పెళ్లి చేసి, ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మలు కూడా దహనం చేస్తున్నాయి. అయితే, బెంగళూరులో అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. రెండు గొర్రెలకు పెళ్లి చేసిన కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు తాము ప్రేమికుల రోజుకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రేమికుల రోజున సెలవు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ప్రేమ వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 లేక రూ.1,00,000 ప్రోత్సాహాన్ని ఇవ్వాలని కర్ణాటక రక్షణ వేదిక నాయకుడు విఠల్ నాగరాజు వ్యాఖ్యానించారు.