Telugudesam: ఏపీకి రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపండి: అరుణ్ జైట్లీకి చంద్రబాబు లేఖ
- పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయి
- ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు
- ధాన్యం విక్రయించినప్పటికీ డబ్బులేని పరిస్థితుల్లో రైతులు
- అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు లేఖ రాసిన సీఎం చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు నాటి పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయని, ఏటీఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు చంద్రబాబు లేఖ రాశారు. ఏపీకి తక్షణం రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపాలని కోరారు. ధాన్యం విక్రయించినప్పటికీ డబ్బులు తీసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆ లేఖలో చంద్రబాబు కోరినట్టు సమాచారం.