Flipkart: విక్రయాల్లో రికార్డు సృష్టించిన ఆనర్ 9 లైట్.. ఆరు నిమిషాల్లోనే మొత్తం అవుటాఫ్ స్టాక్!
- ఫ్లిప్‌కార్టులో అమ్మకానికి వచ్చిన నిమిషాల్లోనే మొత్తం ఫోన్ల విక్రయం
- తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు
- రెండు వైపులా డ్యూయల్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హువేయి తాజా స్మార్ట్‌ఫోన్ ఆనర్ 9లైట్ హాట్‌కేకులా అమ్ముడుపోయింది. ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి పెట్టిన ఆరు నిమిషాల్లోనే మొత్తం ఫోన్లు అమ్ముడైపోయాయి. మంగళవారం మధ్యాహ్నం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు విక్రయానికి రాగా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. అతి తక్కువ ధరలోనే అత్యధిక ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించినట్టు హువేయి కన్జుమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ పి.సంజీవ్ తెలిపారు. రెండు వైపులా డ్యూయల్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.
ఆనర్ 9 లైట్ ప్రత్యేకతలు: 5.65 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్, కిరిన్ 659 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీకార్డు ద్వారా 256 జీబీల వరకు పెంచుకునే వెసులుబాటు, 13 ఎంపీ+2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 13 ఎంపీ+2 ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.10,999 మాత్రమే.