Whatsapp: మరో కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తున్న వాట్సాప్.. డేటాను డౌన్లోడ్ చేసుకునే అవకాశం!
- వరుస పెట్టి ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్
- మే నుంచి అందుబాటులోకి డౌన్లోడ్ ఫీచర్
- ఇప్పటికే ఫేస్బుక్లో అందుబాటులో..
మైక్రో బ్లాగింగ్ సైట్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను రెడీ చేస్తోంది. యూజర్లు పంపే ఫొటోలు, మెసేజ్‌లను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని తీసుకురాబోతోంది. మే 25లోపు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఫేస్బుక్లో ఇప్పటికే ఇటువంటి వెసులుబాటు ఉండగా ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు కూడా దానిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూజర్లు తమకు కావాల్సిన డేటాను డౌన్లోడ్ చేసుకునేందుకు అకౌంట్స్‌లోకి వెళ్లి 'డౌన్లోడ్ మై డేటా'పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న 20 రోజుల తర్వాత తమకు కావాల్సిన డేటా అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల్లో డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం జిప్, సీఎస్వీ ఫార్మాట్లలో ఉండే అవకాశం ఉందని సమాచారం. డేటాను ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది. మళ్లీ కావాలంటే మాత్రం మొదటి నుంచి మొదలెట్టాల్సిందే.