Virat Kohli: కోహ్లీ! ముందు ఈ విషయం తెలుసుకో: జాక్వెస్ కలిస్
- కోహ్లీ దూకుడు తగ్గించుకోవాలి
- కెప్టెన్ గా దూకుడు అన్నివేళలా మంచిది కాదు
- అనుభవం వచ్చే కొద్దీ ప్రశాంతంగా ఉంటాడని ఆశిస్తున్నా
కొంచెం దూకుడు తగ్గించుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కలిస్ సూచించాడు. భారత క్రికెట్ మరింత ముందుకు వెళ్లాలంటే దూకుడు తగ్గించుకోవాలని చెప్పాడు. జట్టులోని ఆటగాడి మాదిరి ఓ కెప్టెన్ ప్రతిసారీ దూకుడుగా ఉండకూడదని అన్నాడు.
అనుభవం వచ్చే కొద్దీ కోహ్లీ తన దూకుడు తగ్గించుకుంటాడని, ప్రశాంతంగా ఉండటాన్ని అలవరుచుకుంటాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. క్రికెట్ పై కోహ్లీకి ఉన్న అంకితభావం తనకు ముచ్చట కలిగిస్తోందని అన్నాడు. రానున్న రోజుల్లో భారత జట్టు మరింత మెరుగ్గా తయారవుతుందని చెప్పాడు. విదేశాలలో తన రికార్డును మెరుగుపరుచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందని... తమకు అంతగా ఇష్టం ఉండని బౌన్సీ పిచ్ లపై కూడా రాణించడంపై దృష్టి సారించిందని ప్రశంసించాడు.