pon radhakrishnan: వేర్పాటు వాదుల అడ్డాగా మారుతున్న తమిళనాడు... కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

  • ఇక ఎంత మాత్రం శాంతియుత రాష్ట్రం కాదు
  • ఒక్కటవుతున్న మావోయిస్టులు, టెర్రరిస్టులు, వేర్పాటువాద శక్తులు
  • వీరికి అడ్డాగా, శిక్షణ కేంద్రంగా రాష్ట్రం
  • పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యలు

తమిళనాడు రాష్ట్రం గురించి, ఆ రాష్ట్రానికే చెందిన బీజేపీ నేత, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఇక ఎంత మాత్రం ప్రశాంతతతో కూడిన రాష్ట్రం కాదన్నారు. వేర్పాటువాదులకు శిక్షణ కేంద్రంగా మారుతోందన్నారు. 1998 ఫిబ్రవరి 14న కోయంబత్తూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు పలు హిందూ సంస్థలు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ... తమిళనాడు వేర్పాటు వాద శక్తులకు అడ్డాగా, శిక్షణ కేంద్రంగా మారుతోందన్నారు. మావోయిస్టులు, తమిళ వేర్పాటు వాదులు, ఇస్లామిక్ టెర్రరిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నారని పేర్కొన్నారు. గతేడాది జల్లికట్టు సందర్భంగా జరిగిన భారీ ఆందోళన సందర్భంగా ఇది బయటపడిందన్నారు. ఈ వేర్పాటు వాద శక్తులు వచ్చే 10-20 ఏళ్ల కాలానికి దీర్ఘకాల ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News