Nitin Gadkari: మీ వాహనానికి 15 ఏళ్లు నిండాయా?.. అయితే జాగ్రత్త!

  • 15 ఏళ్లు నిండిన వాహనాలకు బ్రేక్
  • తుది రూపు సంతరించుకుంటున్న నూతన విధానం
  • ఇక పాత వాహనాలన్నీ తుక్కే

మీరు వాడుతున్న వాహనం వయసు 15 ఏళ్లు నిండిందా? అయితే ఇక రోడ్డెక్కడం కుదరదు. దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 15 ఏళ్లు నిండిన వాహనాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విధానాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే దీనికి తుది రూపు వస్తుందన్నారు. ఇందుకోసం నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు.

15 ఏళ్లు నిండిన వాహనాలను స్క్రాప్‌ (తుక్కు)గా మారుస్తామని మంత్రి తెలిపారు. దేశం ఆటోమొబైల్ రంగానికి ప్రధాన కేంద్రం కాబోతోందన్న గడ్కరీ.. వాహనాల తుక్కును వాహనాల విడిభాగాలు, ఇతర వస్తువుల తయారీకి ఉపయోగిస్తామని వివరించారు. ఫలితంగా ముడి సరుకులు మరింత చవగ్గా లభిస్తాయని, ఉత్పాదక వ్యయం గణనీయంగా తగ్గుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News