Mahesh Babu: సినిమా థియేటర్లో మహేశ్ బాబు భారీ ఫైట్
- షూటింగ్ దశలో 'భరత్ అనే నేను'
- మార్చి రెండవ వారంలో ఆడియో రిలీజ్
- ఏప్రిల్ 26న సినిమా విడుదల
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'భరత్ అనే నేను' చిత్రం రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - లింగంపల్లి సమీపంలోని ఓ థియేటర్లో జరుగుతోంది. మహేశ్ బాబు తదితరులపై ఫైట్ సీన్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఈ ఫైట్ సినిమాలో కీలకమైన సందర్భంలో వస్తుందనీ, ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ గా ప్రకాశ్ రాజ్ నటిస్తుండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. మార్చి రెండవ వారంలో ఆడియో వేడుకను నిర్వహించి, ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొరటాల .. మహేష్ క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటం వలన అందరిలోనూ భారీ అంచనాలు వున్నాయి.