Priya Prakash: కొండెక్కి కూర్చున్న 'ఒరు అదార్ లవ్' నిర్మాత... కోటితో తీసిన చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ రెండు కోట్లట!
- ఒక్క కనుగీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్
- తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం సంప్రదింపులు
- నిర్మాత చెప్పిన ఎమౌంట్ విని దిమ్మతిరిగిందట!
ప్రియా ప్రకాశ్ వారియర్... ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కేరళ సుందరి. ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్'లోని ఓ పాట టీజర్ విడుదల కాగా, రాత్రికి రాత్రే నెట్టింట స్టార్ గా మారిపోయిన అమ్మాయి. ఇక ఆమెకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలని భావించిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు 'ఒరు అదార్ లవ్' నిర్మాతలను సంప్రదించగా, ఆయన చెప్పిన ఎమౌంట్ విని దిమ్మతిరిగిందట.
ఈ చిత్రాన్ని కోటి రూపాయల్లోపే నిర్మించిన సదరు నిర్మాత, కొండెక్కి కూర్చుని, కేవలం తెలుగు డబ్బింగ్ హక్కులను విక్రయించేందుకు రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఆపై అంత మొత్తం ఇచ్చేందుకు సదరు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అంగీకరించాడా? అన్నది తెలియలేదు. కాగా, ప్రియకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.