adithya menon: 'బాహుబలి'లో చేయలేకపోయినందుకు బాధపడ్డాను: ఆదిత్య మీనన్

  • టాలెంట్ 10 పర్సెంట్ ఉంటే సరిపోతుంది
  • 90 పర్సెంట్ రిలేషన్ షిప్స్ తెలిసి ఉండాలి 
  • ఈ విషయంలో నేను కొంచెం వీక్

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నటుడిగా ఆదిత్య మీనన్ కి మంచి గుర్తింపు వుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలనే ఆయన ఎక్కువగా పోషిస్తూ వస్తున్నారు. కోటేరు ముక్కుతో .. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను మెప్పించడం ఆయన ప్రత్యేకత. క్షేత్రం .. దూకుడు .. ఈగ .. మిర్చి .. సినిమాల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

" రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' సినిమా చేసిన మీకు 'బాహుబలి'లో అవకాశం దక్కలేదు .. అందుకు బాధపడ్డారా?" అనే ప్రశ్న ఎదురైంది. 'నిజంగానే ఫీలయ్యాను .. అయినా అన్ని సినిమాల్లో మనమే ఉండాలంటే కుదరదు కదా అని సరిపెట్టుకున్నాను' అన్నారు. 'విలన్ షేడ్స్ గల పాత్రలకి కూడా పోటీ పెరిగిపోతోంది. ఈ పోటీని తట్టుకోవడానికి మీరేం చేస్తుంటారు?' అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ .. ' నాకు అర్థమైన విషయం ఏమిటంటే .. సినిమాల్లో టాలెంట్ 10 పర్సెంట్ వుంటే సరిపోతుంది. 90 పర్సెంట్ వచ్చి నెట్వర్కింగ్ .. రిలేషన్ షిప్స్ పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నేను కొంచెం వీక్ అనుకుంటున్నాను' అంటూ సమాధానమిచ్చారు.  
 

  • Loading...

More Telugu News