ravi shasthri: ప్రపంచంలోని బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీనే బెస్ట్: చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం
- కోహ్లీని ప్రశంసిస్తూ రాయడానికి పదాలు కరవై ఉంటాయి
- ఒకవేళ కోహ్లీని పొగుడుతూ రాయాలంటే బుక్‌స్టోర్‌కు వెళ్లి కొత్త ఆక్స్ఫర్డ్ నిఘంటువు కొనుక్కుంటా
- పద సంపదను పెంచుకుంటా
విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీని ప్రశంసిస్తూ రాయడానికి పదాలు కరవై ఉంటాయని, ఒకవేళ కోహ్లీని పొగుడుతూ రాయాలంటే తాను బుక్‌స్టోర్‌కు వెళ్లి కొత్త ఆక్స్ఫర్డ్ నిఘంటువు కొనుక్కుంటానని, తన పద సంపదను పెంచుకుంటానని చమత్కరించారు.
ప్రపంచంలోని బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీనే బెస్ట్ అని రవిశాస్త్రి కొనియాడారు. గతంలో తాను భారత జట్టు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో... మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్ల భాగస్వామ్యాన్ని ఎలా విడదీయాలన్న దాని గురించి కోహ్లీతో కలసి తీవ్రంగా ఆలోచించేవాడినని, ఇప్పుడు ఆ బాధ తప్పిందని, ప్రస్తుతం ఆ బాధ్యతను బౌలర్లు కుల్దీప్ యాదవ్-చాహల్ అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. అంతేగాక, వారిద్దరూ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ బాగా రాణిస్తున్నారని చెప్పారు.