Pawan Kalyan: జేఎఫ్‌సీ కోసం హైదరాబాద్‌కు 118 పేజీల నివేదిక పంపిన ఏపీ ప్రభుత్వం
- పవన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బందికి అందజేత
- నివేదికలో విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలు వివరాలు
- బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మోదీకి ఏపీ అంశాలపై ఇచ్చిన వివరాలు కూడా
లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ లతో కలసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ).. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయంపై నిజానిజాలను పరిశీలిస్తోన్న విషయం తెలిసిందే. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జేఎఫ్‌సీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన సిబ్బంది ద్వారా అమరావతి నుంచి హైదరాబాద్‌కు 118 పేజీల నివేదిక పంపింది.
పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది శ్రీకాంత్‌కు దాన్ని అందజేశారు. అందులో విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలుతో పాటు పలు వివరాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ అంశాలపై ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.