Hyderabad: జన్యుసంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలుడిని హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడిన కేసీఆర్!
- జన్యుసంబంధమైన వ్యాధితో బాధపడుతోన్న వరంగల్‌కు చెందిన విఘ్నేష్
- కేసీఆర్‌ను చూడాలని విఘ్నేష్‌కు కోరిక
- విఘ్నేష్‌ను పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్
అనారోగ్యంతో బాధపడుతోన్న పదకొండేళ్ల ఓ బాలుడుకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడాలని కోరిక. ఆ బాలుడి కోరిక ఈ రోజు నెరవేరింది. ఈ రోజు కేసీఆర్ తన పుట్టినరోజు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ వరంగల్ కు చెందిన సదరు బాలుడు విఘ్నేష్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు పిలిచారు.
తన తల్లిదండ్రులతో అక్కడకు వచ్చిన విఘ్నేష్‌ను కేసీఆర్ పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ బాలుడి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ఆ బాలుడి వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. విఘ్నేష్‌కి జన్యుసంబంధమైన వ్యాధి ఉంది.