Pawan Kalyan: పవన్ కావాలా? పోర్న్ కావాలా?: ఆన్ లైన్ లో రాంగోపాల్ వర్మ ఓటింగ్ కాంటెస్ట్!
- నిన్నంతా పోలీసుల విచారణలో రాంగోపాల్ వర్మ
- రాత్రి 11 గంటల సమయంలో మరో అభ్యంతరకర ట్వీట్
- 'పోర్న్ పవన్' అంటూ హ్యాష్ ట్యాగ్
నిన్నంతా హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో గడిపిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, గత రాత్రి 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో మరో అభ్యంతరకర పోస్టును, ఓ కాంటెస్టును పెట్టారు. పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే, ఆయన పేరును అశ్లీలంతో కలిపి కలకలం రేపారు. పోర్న్ అన్నా, పవన్ అన్నా తనకు ఇష్టమని చెబుతూ 'పోర్న్ పవన్' అన్న హ్యాష్ ట్యాగ్ సృష్టించాడు. అంతేకాదు, ట్విట్టర్ లో ఓ ఓటింగ్ ను పెట్టిన ఆయన, పవన్ అంటే ఇష్టమా?, లేక పోర్న్ అంటే ఇష్టమా? చెప్పాలని కోరాడు. నిన్న ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో, ఆడవారిపై తన కామెంట్లకు క్షమాపణలు కోరిన వర్మ, ఆపై గంటల వ్యవధిలోనే ఇలా విమర్శలను కురిపించే పోస్ట్ పెట్టడం గమనార్హం.