microsoft: ఆకట్టుకునే ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ 'ఫొటోస్ కంపానియన్' కొత్త యాప్!
- ఫొటోలు పంపడం ఇక సులువు
- ఆండ్రాయిడ్ 4.1, ఐఓఎస్ 10.2వెర్షన్ల వారికి లభ్యం
- వైఫై ద్వారా నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలి
దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై తాజాగా 'ఫొటోస్ కంపానియన్' యాప్‌ను విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 లేదా ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లపై లభిస్తుంది.
అలాగే ఐఓఎస్ 10.2 డివైస్ ఉన్నవారు ఈ యాప్ ని పొందే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమ డివైస్‌లలో ఉండే ఫొటోలను విండోస్ 10 పీసీకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికోసం రెండు డివైస్‌లను వైఫై ద్వారా నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయవలసి ఉంటుంది. ఈ యాప్ సాయంతో యూజర్లు తమ ఫొటోలను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.