malvinder: మల్విందర్ సింగ్ సోదరులపై దర్యాప్తునకు సెబీ ఆదేశాలు

  • ఫోర్టిస్, రెలిగేర్ సంస్థలపై విచారణకు ఆదేశాలు
  • అక్రమంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలు
  • ఇటీవలే కంపెనీల బోర్డులకు సింగ్ సోదరుల రాజీనామా

ర్యాన్ బ్యాక్సీ కంపెనీ మాజీ సారధులు, ప్రస్తుత ఫోర్టిస్ హాస్సిటల్ యజమానులైన మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లకు కష్టాలు మరింత పెరిగాయి. వీరికి చెందిన ఫోర్టిస్ హెల్త్ కేర్, రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ లపై తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ విచారణకు (ఎస్ఎఫ్ఐవో) సెబీ ఆదేశించింది. ఈ రెండు కంపెనీల బోర్డులకు సింగ్ సోదరులు ఇటీవలే రాజీనామా కూడా చేశారు. ర్యాన్ బ్యాక్సీ కంపెనీని గతంలో వీరు జపాన్ కు చెందిన దైచీ శాంక్యోకు విక్రయించారు.

ఆ సందర్భంగా వాస్తవాలను కప్పిపెట్టి అధిక విలువకు తమకు ర్యాన్ బ్యాక్సీని విక్రయించారన్నది దైచీ శాంక్యో ఆరోపణ. దీనిపై ఢిల్లీ హైకోర్టు కూడా దైచీ వాదననే సమర్థిస్తూ రూ.3,500 కోట్లు చెల్లించాలని సింగ్ సోదరులని ఆదేశించింది. ర్యాన్ బ్యాక్సీని విక్రయించిన తర్వాత సింగ్ సోదరులు, రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఆర్థిక సేవలు, ఫోర్టిస్ హెల్త్ కేర్ పేరుతో వైద్య సేవల్ని ఆరంభించారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ నుంచి అక్రమంగా నిధుల్ని మళ్లించారనే ఆరోపణలను వారు ఇప్పుడు ఎదుర్కొంంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు సెబీ ఆదేశించడం గమనార్హం.

  • Loading...

More Telugu News