stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- దేశీయ మార్కెట్లపై కొనసాగుతున్న పీఎన్ బీ కుంభకోణం ప్రభావం
- సెన్సెక్స్ 236 పాయింట్లు..నిఫ్టీ 74 పాయింట్లు పతనం
- భారీగా దెబ్బతిన్న బ్యాంకుల షేర్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) కుంభకోణం నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి 33,775 పాయింట్ల వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,378 పాయింట్ల వద్ద ముగిశాయి. పీఎన్ బీ కుంభకోణం కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో ఉండటం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. షేర్ల విషయానికొస్తే బీఎస్ఈలో యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్బీఐ షేర్లు భారీగా పతనమయ్యాయి.