kkr: కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ వేట ముగిసినట్టేనా?

  • కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా విజయవంతమైన గౌతమ్ గంభీర్
  • తనను కొనుగోలు చేయవద్దని చెప్పిన గంభీర్
  • రాబిన్ ఊతప్ప కెప్టెన్ అవుతాడంటూ ఊహాగానాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్-11 (2018) కు ఫ్రాంఛైజీలన్నీ ఆటగాళ్లతో సంసిద్ధంగా ఉన్నాయి. జట్లన్నీ కెప్టెన్లను ఎంపిక సమయంలోనే ఖరారు చేసుకోగా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుది మాత్రం చిత్రమైన పరిస్థితి. కోల్ కతా జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న గంభీర్ స్వయంగా జట్టును వీడనున్నట్టు యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో ఆ జట్టులో నాయకత్వ బాధ్యతలు చేపట్టే ఆటగాడు ఎవరంటూ ఆసక్తి నెలకొంది. దీనికి తెరదించుతూ, ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్ లిన్ కు కెప్టెన్సీ అప్పగించనున్నట్టు తెలుస్తోంది. గత ఐపీఎల్ లో ఒక్క మెరుపు మెరిసిన క్రిస్ లిన్ నిలకడతో కూడిన దూకుడును ప్రదర్శించాడు. దీంతో లిన్ ను కేకేఆర్ జట్టు 9.6 కోట్ల భారీ మొత్తానికి వేలంపాటలో దక్కించుకుంది.

తొలుత రాబిన్ ఊతప్పకు కెప్టెన్సీ దక్కనుందంటూ ఊహాగానాలు వినిపించినప్పటికీ జట్టు యాజమాన్యం క్రిస్ లిన్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అవకాశం వస్తే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ లిన్ ప్రకటించడంతో కేకేఆర్ కెప్టెన్ గా క్రిస్ లిన్ ఖాయమని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

  • Loading...

More Telugu News