emma thompson: లైంగిక బాధితుల సహాయ నిధికి 9 కోట్ల విరాళమందించిన హాలీవుడ్ నటి
- పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఆపాలంటూ ఈ-క్యాంపెయిన్
- లైంగిక బాధితులకు అండగా నిలిచేందుకు ప్రారంభించిన 'యూకే జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్'
- విరాళమిచ్చిన ఎమ్మా ధాంప్సన్
‘హ్యారీ పోటర్’ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచారు. లైంగిక బాధితుల సహాయార్థం ప్రారంభించిన 'యూకే జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్'కు మిలియన్ పౌండ్లు (రూ.9 కోట్లకుపై చిలుకు) విరాళమిచ్చారు. పని (వర్కింగ్) ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు స్వస్తి పలకాలంటూ సుమారు 200 మందికిపైగా బ్రిటిష్, ఐరిష్ నటీమణులు బహిరంగ లేఖ రాసి, సంతకాలు చేశారు.
ఈ క్రమంలో లైంగిక బాధితులకు సహాయం చేసేందుకు ఈ-క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇలా సంతకాలు చేసిన వారిలో ఎమ్మా థాంప్సన్ తో పాటు కేరీ ముల్లిగాన్, సాఇర్స్ రోనన్, గెమ్మా ఛాన్, కైరా నైట్లీ తదితరులున్నారు. కాగా, ఆ ఫండ్ కు విరాళమందించిన తొలి దాత ఎమ్మా కావడం విశేషం. దీంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఎమ్మా ‘హ్యారీ పోటర్’ సిరీస్, ‘ది బ్లింగ్ రింగ్’, ‘దిస్ ఈజ్ ద ఎండ్’, ‘కొలోనియా’, ‘బ్యూటీ అండ్ ది బీస్ట్’ తదితర చిత్రాల్లో నటించింది.