Karnataka: ప్రధాని మోదీకి రూంలు ఖాళీ లేవని చెప్పిన మైసూర్ హోటల్!

  • ప్రస్తుతం మైసూర్ పర్యటనలో వున్న మోదీ 
  • ప్రధాని బసకు హోటల్ లలితా మహల్ ప్యాలెస్ ను సంప్రదించిన అధికారులు 
  • రూంలు ముందే బుక్ అయిపోయాయని చెప్పిన హోటల్ యాజమాన్యం
 ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు వ్యాపారవేత్తలు తీవ్రప్రయత్నాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే సాక్షాత్తూ ప్రధాని బస చేసేందుకు వస్తున్నారు, మీ హోటల్లో బస కావాలంటే... రూములు ఖాళీ లేవని చెప్పిన ఘటన మైసూర్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మైసూర్‌ పర్యటనలో వున్న ప్రధాని మోదీ బస కోసం మొదట్లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం సిబ్బంది హోటల్ లలితా మహల్ ప్యాలెస్ ను సంప్రదించారు.

అయితే ఓ వివాహం రిసెప్షన్‌ కోసం రూములన్నీ ఇదివరకే బుక్‌ అయ్యాయని, ప్రధాని, ఆయన భద్రతా సిబ్బందికి వసతి కల్పించలేమని హోటల్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రధాని పర్యటన సమయంలోనే వివాహ రిసెప్షన్‌ ప్రారంభమైందని వారు పేర్కొన్నారు. ఈ సమయంలో తమ హోటల్‌ లో కేవలం మూడు రూములే ఖాళీగా ఉన్నాయని, ఆ మూడు రూములు భద్రతా కారణాల రీత్యా ప్రధానికి ఏమాత్రం సరిపోవని తెలిపారు. దీంతో ప్రధాని బసను రాడిసన్ బ్లూ హోటల్ లో ఏర్పాటు చేశారు.
 
Karnataka
mysore
Prime Minister
Narendra Modi

More Telugu News