Priya Prakash Varrier: దీపిక మన్మథుడిపై కన్నేసిన ప్రియా వారియర్..!

  • షారూఖ్, సిద్ధార్థ్, రణ్‌వీర్ అంటే ఇష్టం
  • ఛాన్స్ వస్తే వారితో నటించేందుకు రెడీ
  • హీరోయిన్లలో దీపికా పదుకునే నచ్చిందని వెల్లడి
ఒక్క 'కన్నుకొట్టుడు' సీన్‌తో ఓవర్‌నైట్‌లో పాప్యులారిటీ సంపాదించిన కేరళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ బాలీవుడ్‌లో తనకిష్టమైన స్టార్ల గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది. బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్ధార్ధ్ మల్హోత్రా లాంటి హీరోలంటే తనకు చాలా ఇష్టమని, వారి సరసన అవకాశం వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది.

హీరోయిన్ల విషయానికొస్తే, దీపిక పదుకునే అంటే తనకిష్టమంది. ఈ క్యూట్ గర్ల్ 'ఒరు అదార్ లవ్' అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రంలోని 'మాణిక్య మలరాయ పూవే' పాటలో ఆమె ప్రదర్శించిన ఎక్స్‌ప్రెషన్లు అందర్నీ ముఖ్యంగా యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఆ వీడియోకు యూట్యూబ్‌లో ఏకంగా 80 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రియా వారియర్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 ఇక గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో అత్యధికంగా శోధిస్తున్న వ్యక్తుల జాబితాలో ఇప్పటివరకు హవా కొనసాగిస్తున్న పోర్న్ తార సన్నీ లియోన్‌ని కూడా ప్రియా దాటేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఫేస్‌బుక్‌లోనైతే ఆమెను 45 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
Priya Prakash Varrier
Sunny Leone
Shah Rukh Khan
Ranveer Singh
Sidharth Malhotra

More Telugu News